సారంగాపూర్, 4 July
సారంగాపూర్ మండలం జాం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) పాఠశాలలో రూ.38 లక్షల అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెరుగైన విద్యా వాతావరణం కల్పిస్తామని ఆయన తెలిపారు.
సారంగాపూర్ మండలం జాం గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) పాఠశాలలో రూ.38 లక్షల అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థినులకు మెరుగైన విద్యా వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాల్వ నరేష్, జాం గ్రామ సర్పంచ్ కరిపే రవలీ విలాస్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది, మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.








