మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 04
మంచిర్యాల మహాప్రస్థానంపై వస్తున్న ఆరోపణలు సత్యదూరమని, రాజకీయ విమర్శలు చేయడం తగదని మంచిర్యాల్ వెల్ఫేర్ చారిటబుల్ సొసైటీ అడ్వైజర్ గుండా సుధాకర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు 602 ఖననాలు నిర్వహించగా, 105 మంది పేదవారికి ఉచితంగా అంతిమ సంస్కారాలు అందించామన్నారు. రూ. 10.20 కోట్లతో నిర్మాణం జరిగిందని వెల్లడించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో గోదావరి రోడ్డులో మహాప్రస్థానాన్ని గొప్పగా ఏర్పాటు చేశారని, అయితే దీనిపై వస్తున్న ఆరోపణలు సత్యదూరమని, రాజకీయ విమర్శలు చేయడం తగదని మంచిర్యాల్ వెల్ఫేర్ చారిటబుల్ సొసైటీ అడ్వైజర్ గుండా సుధాకర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
మంచిర్యాల్ వెల్ఫేర్ చారిటబుల్ సొసైటీ ద్వారా సేవలు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 602 ఖననాలు నిర్వహించగా, అందులో 105 మంది పేదవారికి ఉచితంగా అంతిమ సంస్కారాలు అందించామని తెలిపారు. 14వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన టాక్స్ కింద రూ. 4 కోట్లు, మిగిలిన రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కలిపి మొత్తం రూ. 10.20 కోట్లతో నిర్మాణం జరిగినట్లు వెల్లడించారు.
కొందరు నాయకులు స్మశాన వాటికపై నిరాధారమైన ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేకు సొంత వ్యక్తులు సొసైటీలో లేరని, కేవలం స్వచ్ఛంద సేవకులను వెల్ఫేర్ సొసైటీగా కార్యక్రమాల నిర్వహణ చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్ పరిధిలో పూర్తి బాధ్యతగా మంచిర్యాల చారిటబుల్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మహాప్రస్థానంతో పాటు లక్షట్ పేటలో కళాశాల, హైస్కూల్, ఆసుపత్రి నిర్వహణ చేస్తున్నట్లు, ప్రతి రూపాయి లెక్క ఉంటుందని, ఆదాయపు పన్ను చెల్లింపు చేస్తున్నట్లు తెలిపారు.
అనుమానాలు ఉన్నవారు లెక్కలను కోరితే ముందుంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుధాకర్ తెలిపారు. ఎమ్మెల్యే పి.ఎస్.ఆర్. సొసైటీ అధ్యక్షులుగా ఉన్నప్పటికీ, పూర్తి నిర్వహణ కమిటీ చేస్తుందని చెప్పారు. మహాప్రస్థానం సేవలపై మంచిర్యాల ప్రజలే కాకుండా బెల్లంపల్లి, గోలేటి వారు సైతం అంతిమ సంస్కారాలు మహాప్రస్థానంలో చేస్తున్నారన్నారు. తమ నిర్వహణ పూర్తి పారదర్శకంగా, చిత్తశుద్ధితో ఉందని, రాజకీయ విమర్శలకు తావులేకుండా తమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు.
ఈ సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షులు మంగీలాల్ సోమని, నాయకులు కటకం హరీష్, చిట్ల సత్యనారాయణ, రమణ తదితరులు పాల్గొన్నారు.


