సంగారెడ్డి జిల్లాకు చెందిన పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు టూరిజం శాఖ నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించారు. విద్యార్థులు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
పాఠశాల స్థాయిలో జెడ్పీహెచ్ఎస్ గుమ్మడిదల విద్యార్థులు ప్రథమ బహుమతి, జెడ్పీహెచ్ఎస్ (బాలుర) జోగిపేట విద్యార్థులు ద్వితీయ బహుమతి, జెడ్పీహెచ్ఎస్ సింగీతం, కలబ్గూర్ విద్యార్థులు తృతీయ బహుమతి సాధించారు. కళాశాల స్థాయిలో సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాల ప్రథమ బహుమతి, పటాన్చెరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వితీయ బహుమతి, కోహీర్లోని ఎంజేపీటీ కళాశాల తృతీయ బహుమతి సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. చదువుతో పాటు వివిధ పోటీలు, సాంస్కృతిక, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను మరింతగా పెంపొందించుకోవాలని సూచించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఉన్నత స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించిన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. విజేతలను ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యాశాఖ అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఇన్చార్జి అధికారి కేవీఎస్ ప్రసాద్ రెడ్డి, విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.












