మంచిర్యాలలోని ఒకేషనల్ జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో శ్రీ సాయి పారామెడికల్ కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలు స్థానిక హరిత ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పి. శ్రీనివాస్ హాజరయ్యారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత శిఖరాలను అధిగమించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యతో పాటు వృత్తిలో నైపుణ్యంతో జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని విద్యార్థులను దీవించారు. ఈ పారామెడికల్ కళాశాల గత 18 సంవత్సరాలుగా మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్-రే టెక్నీషియన్, అసిస్టెంట్ టెక్నీషియన్, ఆప్తాల్మిక్ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ వంటి కోర్సుల్లో విద్యను అందిస్తోంది. ఈ కోర్సుల్లో విద్యనభ్యసించిన ఎంతోమంది విద్యార్థులు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి శ్రీదేవి, శైలజ మేడం, స్వప్న మేడం, కళాశాల డైరెక్టర్లు డాక్టర్ ఆదిత్య బాబు, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ మహాలక్ష్మి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.












