20వ జాతీయ అంతర్జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ పోటీల (ఎన్ఐడీజేఏఎం) కోసం జిల్లా జట్టు ఎంపిక పోటీలు సోమవారం లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో జరిగాయి. ఈ పోటీలను మాజీ టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అండర్-14, అండర్-16 విభాగాల్లో సుమారు 600 మంది బాలబాలికలు ఈ ఎంపికల్లో పాల్గొన్నారు.
ముఖ్య అతిథిగా హాజరైన మాజీ టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపి, క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రోత్సహించారు. 60 మీటర్లు, 600 మీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్, జావెలిన్ త్రో, ట్రయాథ్లాన్, పెంటాథ్లాన్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు ఎం.డి. సోహైల్ అలీ, కార్యదర్శి ఎం.డి. జావీద్ అలీ ఆధ్వర్యంలో పోటీలు విజయవంతంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీజీఈజేఏసీ చైర్మన్ ఎం.డి. జావీద్ అలీ, టీఎన్జీవోస్ కార్యదర్శి వి. రవి, సహాధ్యక్షుడు కాసిని శ్రీకాంత్, వెంకట్‌రెడ్డి, కోశాధికారి జి. శ్రీనివాస్, ప్రమోద్‌కుమార్, రాష్ట్ర వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం అధ్యక్షుడు భాస్కర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు షరీఫ్, టీఎన్జీవోస్ ప్రతినిధులు మల్లికార్జున్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కోచ్‌లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.












