సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పోట్రు.రామకృష్ణ ప్రతిష్టాత్మక డా. ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ స్ఫూర్తి పురస్కార్ అవార్డు 2026కు ఎంపికయ్యారు. డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు.
శుక్రవారం హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో జరిగే కార్యక్రమంలో రామకృష్ణ ఈ పురస్కారాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందుకుంటారని శ్రీ ప్రగతి ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. విద్యా, పర్యావరణ, సామాజిక సేవా రంగాలలో ఆయన చేసిన కృషికిగాను ఈ పురస్కారానికి ఎంపికైనట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణకు పలువురు అభినందనలు తెలిపారు.












