ప్రోగ్రెసివ్ టీచర్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీటీఎస్) ఆరవ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నల్గొండలో గురు, శుక్రవారాల్లో జరిగాయి. ఈ సమావేశాల్లో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయగా, సదాశివపేట మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులకు కీలక పదవులు దక్కాయి.
నూతనంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గంలో అసోసియేట్ అధ్యక్షుడిగా దయానంద్, ఉపాధ్యక్షులుగా రామకృష్ణ, నర్సింహారెడ్డి, కార్యదర్శిగా సుజాద్దీన్ ఎన్నికయ్యారు. వీరితో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బిక్షం గౌడ్ ప్రమాణ స్వీకారం చేయించారు. సదాశివపేట మండలానికి చెందిన నలుగురు ఉపాధ్యాయులకు రాష్ట్ర కార్యవర్గంలో స్థానం లభించడం మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రమేష్తో పాటు పలువురు ఉపాధ్యాయులు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు.












