తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ () ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-) పోస్టుల భర్తీకి శనివారం నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష () ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మండలం రుద్రారం గ్రామంలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పాండు తనిఖీ చేశారు.
పరీక్ష నిర్వహణ తీరుతెన్నులను పరిశీలించిన అదనపు కలెక్టర్ పాండు, అభ్యర్థుల హాజరు, బయోమెట్రిక్ నమోదు, సీసీ కెమెరాల పనితీరుపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చేపట్టిన భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే అభ్యర్థులను మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేయడం, సెల్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకుండా తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. అభ్యర్థులకు తాగునీరు, ప్రథమ చికిత్స సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా అని కూడా పరిశీలించారు. నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ, పరీక్షలు సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని నిర్వాహకులకు సూచించారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని తెలిపారు. ఈ పరీక్ష ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో నిర్వహించబడింది. మొత్తం 150 మంది అభ్యర్థులకు గాను 89 మంది పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.












