జనగామ మండల పరిధిలోని పవర్ హౌజ్ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ప్రాముఖ్యతను తెలియజేసే సందర్భంలో జరిగింది.
బి.జె.పి రామగుండం నియోజకవర్గ ఇంచార్జ్, రాష్ట్ర ఓబీసీ మోర్చ ఉపాధ్యక్షురాలు శ్రీమతి కందుల సంధ్యారాణి గారి సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. మండల పరిషద్ ప్రాథమిక పాఠశాల (MPPS, POWERHOUSE COLONY) లోని చిన్నారులకు విద్యా సామగ్రిని అందజేశారు.
దేశ ప్రజల సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పి.ఎం కిసాన్ యోజన, పి.ఎం. ఆవాస్ యోజన, జన్ ధన్ యోజన, సుకన్య యోజన, అయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, వందే భారత్, ఉచిత రేషన్ బియ్యం వంటి పథకాల ఆవశ్యకతను ఈ సందర్భంగా వివరించారు.
ఈ కార్యక్రమంలో బి.జె.పి సీనియర్ నాయకులు తడగొండ నర్సయ్య, మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, బియ్యాల మహేందర్, బండారి శ్యామ్, కొట్టే నరేష్, జక్కన బాలు, శిలారపు కల్యాణ్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.












