7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరం వేదికగా జూన్ 6, 7 తేదీలలో జరిగాయి, ఇందులో విద్యాసాగర్ జామి ప్రసాదరావు ప్రత్యేక గుర్తింపు పొందారు.
ఈ మహాసభలు చైతన్య సారస్వత పరిషత్, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుండి సాహితీవేత్తలు, కవులు, రచయితలు పాల్గొన్నారు.
విద్యాసాగర్ జామి ప్రసాదరావు రచించిన పలు గ్రంథాలను సభా వేదికపై ఆవిష్కరించి విడుదల చేశారు. తెలుగు భాషా వికాసానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తించి, ఆయనను శాలువా, మెమెంటో, ప్రశంసాపత్రంతో సత్కరించారు.
ఈ గౌరవం మందమర్రికి చెందిన సాహితీవేత్తకు లభించడం జిల్లా ప్రజలకు గర్వకారణంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు.








