సారంగాపూర్ మండల కేంద్రంలోని జామ్ గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక గ్రామసభ నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి డిపిఓ శ్రీనివాస్, డిఎల్ పిఓ లింగయ్య, ఎంపీడీవో లక్ష్మీకాంత్, ఎంపీ ఓ అజీజ్ ఖాన్, ఉపసర్పంచ్ కరిపే రవళి విలాస్ మరియు గ్రామంలోని వివిధ అధికారులు పాల్గొన్నారు.
సభలో, 2026 సంవత్సరానికి అమలులోకి రానున్న ఘణ వ్యర్థ నిర్వహణ నియమాలు గురించి వివరించబడింది. పర్యావరణ పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా, ప్లాస్టిక్ నివారణ చర్యలలో భాగంగా జ్యూట్ బ్యాగ్‌ల పంపిణీ జరిగింది. మార్కెట్ ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటుచేసిన డస్ట్ బిన్లను ఏర్పాటు చేయడం జరిగింది.
అంతేకాకుండా, "ఏక్ ఫెడ్ మా కే నామ్" కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అవగాహనను పెంపొందించడానికి దోహదపడింది.












