హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో విధులు నిర్వహిస్తున్న 108, 102 అంబులెన్సులను ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర సేవలకు అవసరమైన వస్తువులను ఆయన పరిశీలించారు.
హాజీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో విధులు నిర్వహించే 108, 102 అంబులెన్సులను శనివారం ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర సేవలకు వినియోగించే అన్ని రకాల వస్తువులను ఆయన పరిశీలించారు. హాజీపూర్ వైద్యాధికారి డా.లహరితో మాట్లాడి, అంబులెన్సుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మేనేజర్ కొండల్ రావు, ఈఎంటి రాంబాబు, పైలట్ గోపి, రాజారాం తదితరులు పాల్గొన్నారు.












