గజ్వేల్, 2026-08-09
గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం మహిళలకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు ఆధ్వర్యంలో శిశిర ఆసుపత్రి సహకారంతో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో పలువురు మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి, వ్యాధిపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తిస్తే మెరుగైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ఇటువంటి ఉచిత వైద్య పరీక్షలు మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
వైద్య శిబిరంలో డాక్టర్ శ్రవణ్, డాక్టర్ సింధూ మాధవనేని పాల్గొని మహిళలకు వైద్య సేవలు అందించారు. ఉచిత క్యాన్సర్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని వారు మహిళలకు సూచించారు.