ప్రపంచ పొగాకు నిషేధ దినోత్సవం – 2026 ను పురస్కరించుకొని, జిల్లావ్యాప్తంగా 25-05-2026 నుండి 31-05-2026 వరకు పొగాకు దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. COTPA చట్టం – 2003 అమలుపై ప్రత్యేక దృష్టి సారించి, చట్ట ఉల్లంఘనలపై చర్యలు తీసుకోనున్నారు.
వారంతర కార్యక్రమాలలో భాగంగా, పొగాకు వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన కల్పించబడుతుంది. ప్రజా ప్రదేశాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాలు, హోటళ్లు, దుకాణాలు మరియు విద్యాసంస్థల వద్ద తనిఖీలు నిర్వహించి, COTPA చట్టంలోని సెక్షన్ 4, 5, 6(a), 6(b), మరియు 7 నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు ఇతర విద్యాసంస్థలను “Tobacco Free Educational Institutions (TFEI)” గా ప్రకటించేందుకు చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులు, యువత, ప్రజలలో పొగాకు వ్యసన నివారణపై అవగాహన పెంపొందించడానికి ర్యాలీలు, మానవ హారాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు, పోస్టర్ ప్రదర్శనలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, అవగాహన సమావేశాలు మరియు ఆరోగ్య శిబిరాలు నిర్వహించబడతాయి.
ఈ కార్యక్రమాలలో Tele-MANAS హెల్ప్‌లైన్ – 14416 మరియు జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం (DMHP) పరిధిలో అందుబాటులో ఉన్న Tobacco Cessation Services వివరాలను ప్రజలకు తెలియజేస్తారు. వైద్య, నర్సింగ్, పారామెడికల్ విద్యాసంస్థలలో ప్రత్యేకంగా “Tobacco Free Campus” కార్యక్రమాలను నిర్వహించాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమాల అమలులో వివిధ ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు సమన్వయంతో పనిచేయాలి.












