రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో అందోల్ నియోజకవర్గ స్థాయిలో తెలంగాణ సాంస్కృతిక, సాంప్రదాయాలకు కొలమానంగా నిలిచే విజయదశమి పండుగ సందర్భంగా అలయ్ - బలాయ్ కార్యక్రమాన్ని మండలం తడుదన్ పల్లిలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
అందోల్ నియోజకవర్గంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 3 వేల కోట్ల పై చిలుకు రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు, రోడ్లు, ఆసుపత్రుల నిర్మాణాలు, నర్సింగ్ కాలేజ్, హాస్టల్ నిర్మాణాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేజీబీవీలు, వివిధ విద్యా సంస్థలలో కేఎస్ఆర్ నిధులతో మౌలిక సదుపాయాల కల్పన, కంప్యూటర్ ల్యాబ్ లు, బస్సులు, పాఠశాలల అభివృద్ధి, సంక్షేమ హాస్టల్ లలో మౌలిక సదుపాయాలు, అందోల్ లో స్టేడియం అభివృద్ధి, ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గిరిజన లా కాలేజీ, పాఠశాల భవనాలు, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను మంత్రి వివరించారు. అలాగే, జోగిపేట - అందోల్ పట్టణాల పరిసర ప్రాంతాలను అనుసంధానం చేస్తూ నిర్మించిన బ్రిడ్జిలు, సింగూర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పరిసర ప్రాంతాల ప్రజల అభివృద్ధికి చేపట్టిన అంతర్గత రోడ్ల నిర్మాణం, రవాణా, టూరిజం అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యకర్తలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్, పీసీసీ సభ్యులు కిషన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య, మార్క్ ఫెడ్ డైరెక్టర్ జగన్ మోహన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు జగన్ మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, లక్ష్మి శేషారెడ్డి, ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ సత్యనారాయణ(చిట్టి బాబు), మాజీ చైర్మన్ సురేందర్ గౌడ్, అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిల్లోడి సతీష్, దిగంబర రావు, శేషారెడ్డి, దుర్గారెడ్డి, గణేష్, కేదారనాథ్, వెంకటేశం, విశ్వాస్, విష్ణువర్ధన్ రెడ్డి, అశోక్ లు పాల్గొన్నారు. ఆత్మ కమిటీ చైర్మన్లు కచ్చూరు రావు, మల్లారెడ్డి, సర్పంచులు, కౌన్సిలర్లు, సేవాదళ్, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, కార్మిక సంఘాలు, ఎన్ఎస్ యుఐ నియోజక వర్గ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ సహకార సంఘాల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి అలయ్ బలయ్ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహకు శుభాకాంక్షలు తెలియజేశారు.










