సిబ్బంది (అక్షరవేకువ) నవంబర్ 18
తాళ్లపెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆకస్మికంగా సందర్శించి, వైద్యులకు, వైద్య కి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. టీకాలు, అన్ని ఆరోగ్య కార్యక్రమాలను 100 శాతం పూర్తి చేయాలని, సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు.
తాళ్లపెట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఈరోజు ఆకస్మికంగా సందర్శించి, వైద్యులకు, వైద్య కి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వైద్య కమిషనర్ ప్రతి మంగళవారం అన్ని ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షిస్తున్నందున, తో సమన్వయం చేసుకుంటూ అన్ని ఆరోగ్య కార్యక్రమాలను 100 శాతం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సమయపాలన పాటించడం, వైద్యులు, వైద్య అందుబాటులో ఉండటం, ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో వైద్య లభ్యత, ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాల ఏర్పాటు, మాతా శిశు సంరక్షణలో భాగంగా 100 శాతం గర్భవతుల నమోదు, వైద్యాధికారి ద్వారా నాలుగు చెకప్‌లు చేయించడం, 102 అమ్మ ఒడి అంబులెన్స్ ద్వారా వైద్య సేవలు అందించడం, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు చేయించడం, సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించడం, సాధారణ ప్రసవాలే ముద్దు - సిజేరియన్లు వద్దు అనే నినాదంతో అవగాహన కల్పించడం వంటి అంశాలపై ఆయన సూచనలు అందజేశారు. 100 శాతం టీకాలు, అన్ని రకాల టీకాలను సరైన సమయంలో, సరైన పద్ధతిలో ఇప్పించాలని, ప్రతి బుధ, శనివారాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని, తల్లిదండ్రులకు ముందుగా అన్ని విషయాలు తెలియజేయాలని సూచించారు. క్షయ వ్యాధి నియంత్రణలో భాగంగా క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించడం, రోగులకు మందులు అందజేయడం, అవగాహన కల్పించడం; అసంక్రమణ వ్యాధులైన బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి, తక్షణ వైద్య సదుపాయాలు కల్పించడం, అవగాహన పెంచడం వంటి చర్యలు చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా, జిల్లాలో ఈ-సంజీవని, ఈ-ఔషధ, మానసిక ఆరోగ్యం, టెలిమానస్, కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించడం, కీటక జనిత వ్యాధులు (దోమల ద్వారా వచ్చే వ్యాధులు) ప్రబలకుండా చర్యలు చేపట్టడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలను, వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన కల్పించడం వంటివి చేయాలని ఆదేశించారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని, వైద్యాధికారి, వైద్య సమన్వయంతో పనిచేస్తూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ, పర్యవేక్షకురాలు శ్రీమతి మార్త, వైద్య , జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.







