సంగారెడ్డి, 2026-11-21
సంగారెడ్డి జిల్లాలో 11 ప్రభుత్వ ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో భర్తీ చేయనున్నారు. అర్హులైన వారు ఈ నెల 25లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి రవి కిరణ్ రెడ్డి తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలోని హత్నూర, పటాన్ చెరు, సంగారెడ్డి ఐటీఐలతో పాటు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టులను అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవి కిరణ్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవుట్ సోర్సింగ్ విధానంలో 3 ఆఫీస్ సబార్డినేట్, 3 స్వీపర్, 3 వాచ్మెన్ పోస్టులు, కాంట్రాక్ట్ విధానంలో 2 మల్టీ పర్పస్ వర్కర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.15,600/- వేతనం ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ (బుధవారం) సాయంత్రం 5 గంటలలోపు తమ దరఖాస్తులతో పాటు స్వీయ ధ్రువీకరణ, అవసరమైన ధ్రువ పత్రాలను జతపరిచి, సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లోని జి-బ్లాక్లో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో సమర్పించాలి. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను స్వీకరించబోమని తెలిపారు. ఈ నెల 27వ తేదీన జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తుల పరిశీలన, విద్యార్హతల ధ్రువీకరణ, రాత పరీక్ష తదితర ప్రక్రియల ద్వారా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు, ఇతర సమాచారం కోసం సంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాన్ని సంప్రదించాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సూచించారు.







