తీర్చిదిద్దాలి (అక్షరవేకువ) నవంబర్ 27
బాల్య వివాహాల రహిత దేశంగా తీర్చిదిద్దాలి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు.
బాల్య వివాహాల రహిత దేశంగా తీర్చిదిద్దాలి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. బాల్య వివాహాల రహిత భారత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆయన తెలిపారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ఆవరణలో డ్రీమ్ సొసైటీ ఆధ్వర్యంలో, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్స్ సహకారంతో బాల్య వివాహాల నిరోధంపై ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి చాతరాజుల దుర్గాప్రసాద్, కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాసరావు దేశ్ పాండే, ఇతర అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో బాల్యవివాహాలు చేయరాదని, ఒకవేళ చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం 2006 ప్రకారం శిక్షార్హులవుతారని తెలిపారు. బాల్య వివాహం చేసిన వారికి, ఆ వివాహానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ చట్టపరంగా శిక్ష పడుతుందని తెలిపారు. బాల్య వివాహం చేసినట్లయితే 1 లక్ష రూపాయల జరిమానా, 2 సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుందని తెలిపారు. బాల్య వివాహాల నిర్మూలనపై డ్రీమ్ ప్రాజెక్టు సొసైటీ కృషి అభినందనీయమని అదనపు కలెక్టర్ తెలిపారు.
అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ బాల్యవివాహానికి సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ, కార్మిక, వైద్య ఆరోగ్య, గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు, పోషణ అభియాన్, చైల్డ్ హెల్ప్ లైన్, బాలల పరిరక్షణ శాఖ, మహిళా సాధికారిత శాఖ ప్రతినిధులు, డ్రీమ్ సొసైటీ ప్రతినిధి సంతోష్, డిస్టిక్ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు, సమన్వయకర్తలు సుజాత, నాగేష్ పాల్గొన్నారు.






