భీమారం, 11 November
గ్రామపంచాయతీ అభివృద్ధికి రూ.10 లక్షలు మంజూరు అయ్యాయి; డ్రైనేజీ సమస్య పరిష్కారానికి రూ.5 లక్షలు, 2 సోలార్ హై మాస్ట్ లైట్ల ఏర్పాటుకు రూ.5 లక్షలు కేటాయించారు.
మండల కేంద్రంలో గ్రామపంచాయతీ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పలు పనులకు శంకుస్థాపన జరిగింది. 11వ వార్డులోని 63 నుండి మల్లన్న గుడి వరకు ఉన్న డ్రైనేజీ సమస్యను సర్పంచ్ ఉస్కామల్ల విజయలక్ష్మి, పున్నం చందు మంత్రి వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి నిధుల నుండి రూ. 5 లక్షలు మంజూరు అయ్యాయి. అదేవిధంగా, గ్రామపంచాయతీకి నిధుల నుండి రూ. 5 లక్షలతో 2 సోలార్ హై మాస్ట్ లైట్లు మంజూరు అయ్యాయి. ఈ సందర్భంగా సర్పంచ్ ఉష్కమల్ల విజయలక్ష్మి, పున్నం చందు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోడేటి రవి, ఉపసర్పంచ్ కోలా సత్తమ్మ, కిష్టయ్య తదితరులు కొబ్బరికాయ కొట్టి పనులకు శంకుస్థాపన చేశారు. సోలార్ లైట్లను పద్మశాలి వాడలో ఒకటి, గొల్లవాడలో ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మల్లేష్, కాంట్రాక్టర్ గుండు తిరుపతి, వార్డు మెంబర్ తిరుపతి, నాయకులు ఆవుల సురేష్, తువ్వ తిరుపతి, వార్డు ప్రజలు, మహిళలు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.







