పరీక్షల్లో (అక్షరవేకువ) నవంబర్ 18
దండేపల్లి మండలంలో పదో తరగతిలో ప్రథమ స్థానం సాధించిన ఆర్. జస్విత్కు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో మిషన్ 10వ తరగతి కార్యక్రమంలో భాగంగా నగదు బహుమతిని అందజేశారు.
దండేపల్లి: శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిషన్ 10వ తరగతి కార్యక్రమంలో భాగంగా, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేస్తున్నారు. ఈ క్రమంలో దండేపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత సంవత్సరం పదో తరగతి మండల ప్రథమ స్థానం సాధించిన ఆర్. జస్విత్ రూ.10 వేల నగదు బహుమతిని అందజేశారు.
కార్యక్రమ వివరాలు
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. రాజేశ్వరరావు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ రాజు, బ్రాంచ్ మేనేజర్ సంతోష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.







