ఆదిలాబాద్ జిల్లా మండలం శాంతాపూర్ గ్రామంలోని రామ్ మందిర్ లో సదానంద్ మహారాజ్ 20వ పుణ్యతిథి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నారాయణ్ మహారాజ్ విచ్చేసి భక్తులకు ఆశీస్సులు అందించారు.
వేడుకలకు శాంతాపూర్ గ్రామస్తులతో పాటు, పరిసర ప్రాంతాల నుంచి ఓడ్ కులస్తులు, భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి, సదానంద్ మహారాజ్ కు నివాళులర్పించి, ఆయన ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా నారాయణ్ మహారాజ్ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటారు.












