మండలం చక్రియాల గ్రామంలో బుధవారం దుర్గామాత నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. భవాని మాత యూత్ ఆర్గనైజర్ తుంగే రాజా మల్లేశం ఆధ్వర్యంలో యూత్ సభ్యులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సర్పంచ్ అనసూజ రాజశేఖర్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసీ ఉద్యోగి తలారి లక్ష్మణ్ రావు, రేషన్ డీలర్ల మండల అధ్యక్షుడు ఉప్పరి దేవదాస్, టీఎన్జీవో సదాశివపేట యూనిట్ అధ్యక్షుడు ఉప్పరి సురేష్, వికాస్ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తలారి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చెందిన బక్కారెడ్డిగారి మాధవ రెడ్డి లక్షా51వేల రూపాయలకు లడ్డును కైవసం చేసుకున్నారు. అనంతరం, భవాని మాత యూత్ సభ్యులు హాజరైన అతిథులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ వేడుకల్లో భవాని యూత్ సభ్యులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.










