నల్గొండ, 15 November
తెలంగాణలో 4,63,857 మందికి కొత్త పెన్షన్లు మంజూరు కానున్నాయి, ఈ నెల 19న అర్హుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.
రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 4,63,857 మందిని కొత్త పెన్షన్లకు అర్హులుగా ఎంపిక చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళల కేటగిరీల్లో లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్లో అత్యధికంగా 35,730 మంది, రంగారెడ్డిలో 30,232 మంది, జిల్లాలో 26,546 మంది అర్హత సాధించారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో 4,087 మంది, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 6,457 మంది ఎంపికయ్యారు.
ఎంపికైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఈ నెల 19వ తేదీన పెన్షన్ నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
దీంతో కొత్తగా పెన్షన్లకు ఎంపికైన లబ్ధిదారులకు త్వరలో ఆర్థిక భరోసా లభించనుంది.







