మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 19
మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని చార్వకాహాల్లో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ బీమా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని చార్వకాహాల్లో కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ బీమా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నీలకంఠ మాట్లాడుతూ.. దేశం గర్వించదగ్గ గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు. ఆమె జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందించాలనే గొప్ప సంకల్పంతో ముందుకు సాగడం అభినందనీయమని అన్నారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం
రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని, సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతున్నాయని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలుస్తుంటే, ప్రతిపక్షాలు ఓర్వలేక విమర్శలు, ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపే ఉందని డాక్టర్ నీలకంఠ ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు వనజ, నాయకులు ఓదేలు, పలిగిరి కనకరాజు, లింగమూర్తి, పెంటు, సాయి గౌడ్, అరుణ తదితరులు పాల్గొన్నారు.







