27 నవంబర్ 26 అక్షరవేకువ (అక్షరవేకువ) నవంబర్ 27
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా మంచిర్యాల పట్టణంలో పోలీసులు భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున సాయికుంట ప్రాంతంలో జరిగిన ఈ ప్రత్యేక ఆపరేషన్లో సరిపోయిన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 67 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు.
నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అనుమానితుల కదలికలపై నిఘా పెంచడమే లక్ష్యంగా మంచిర్యాల పట్టణంలో పోలీసులు భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ జా, డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున మంచిర్యాల పట్టణంలోని సాయికుంట ప్రాంతంలో పోలీసు బలగాలు మోహరించి విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ మెగా డ్రైవ్లో భాగంగా సరిపోయిన పత్రాలు, నంబర్ ప్లేట్లు లేని 67 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. నగరంలో రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై పోలీసులు నిఘా సారించారు. వీరిపై ప్రత్యేక దృష్టి సారించి, జల్లెడ పట్టారు. సైబర్ క్రైమ్, గంజాయి వాడకం, రోడ్ ప్రమాదాల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ ప్రత్యేక ఆపరేషన్లో ఏసీపీ ఆర్. ప్రకాష్, సీఐ ప్రమోద్ రావు ఆధ్వర్యంలో 8 మంది ఎస్ఐలు, సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలో శాంతిభద్రతలను కాపాడటానికి, నేరాలను అరికట్టడానికి ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.






