Kurnool/Maddikera East (అక్షరవేకువ) జూలై 29
మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భార వర్షాల నేథ్యంలో, జిల్లా కలెక్టర్ కుమార్ క్, IAS కోటల్లి మండలంలోని అర్జున్ గుట్ట, ్రాణహిత ని రిసరాలను 29-07-2026న సంర్శించి, రిస్థితిని సమక్షించారు. వర ము్ున్న ్రాంతాలను రిశలించి, అధికారులకు సూచనలు అంించారు.
మంచిర్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, 29-07-2026న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, IAS కోటపల్లి మండలంలోని అర్జున్ గుట్ట, ప్రాణహిత నది పరిసరాలను సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. వరద ప్రభావంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాలను పరిశీలించి, అధికారులకు అవసరమైన సూచనలు అందించారు.
అర్జున్ గుట్ట సమీపంలోని ప్రభుత్వ పాఠశాల భవనాన్ని, పాత ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాల భవనం శిథిలావస్థలో ఉండటంతో, విద్యార్థులు, గ్రామస్థుల భద్రత దృష్ట్యా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణహిత నది, లోతట్టు ప్రాంతాలు, వరద నీటిలోకి వెళ్లవద్దని కలెక్టర్ సూచించారు.
ఈ పర్యటనలో కోటపల్లి అర్జున్ గుట్ట ఎమ్మార్వో, ఎంపీడీవో, చెన్నూరు సీఐ, కోటపల్లి ఎస్ఐ, పోలీసు బృందం, SDRF బృందం, రాపన్పల్లి గ్రామ సర్పంచ్ అట్టెల ప్రభాకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోయిని నగేష్ దొర, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు.











