హజీపూర్, 2026-11-21
హాజీపూర్ మండలం దొనబండలో చేపట్టిన అభివృద్ధి పనుల కోసం లారీల ద్వారా మట్టి తరలింపులో గుత్తేదారు నిబంధనలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల గ్రామంలో విపరీతంగా దుమ్ము లేచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుమార్లు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని తెలిపారు.
హాజీపూర్ మండలం దొనబండలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు లారీల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. గుత్తేదారు సరైన నిబంధనలు పాటించకుండా ఇష్టరీతిన లారీల్లో మట్టిని తరలిస్తుండటంతో గ్రామంలో దుమ్ము లేచి ప్రజలు అవస్థలు పడుతున్నారు. పనులు చేసే క్రమంలో రహదారులపై నీటిని చల్లుతూ పనులు చేయాల్సి ఉండగా, ఎలాంటి భద్రతా చర్యలు పాటించకపోవడంతో దుమ్ము లేచి పలుమార్లు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.







