భారత స్టాక్ మార్కెట్ మరోసారి అంతర్జాతీయ మార్కెట్లతో పోలిస్తే మెరుగైన పనితీరును కనబరుస్తోంది. నవంబర్ ప్రారంభం నుంచి దేశీయ సూచీలు పుంజుకుంటున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా లాభాలను నమోదు చేయడం పెట్టుబడిదారులలో ఆశావాదాన్ని పెంచుతోంది.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తిరిగి భారత మార్కెట్లలో పెట్టుబడులు పెంచడం ఈ ర్యాలీకి ప్రధాన కారణంగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా కృత్రిమ మేధ () ఆధారిత కంపెనీల షేర్లపై ఆసక్తి తగ్గడంతో పెట్టుబడులు ఇతర మార్కెట్ల వైపు మళ్లుతున్నాయి. ఈ పరిణామం భారత ఈక్విటీ మార్కెట్లకు అనుకూలంగా మారింది. మరోవైపు ముడిచమురు ధరలు తగ్గడం, కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు మెరుగుపడటం, దేశీయ మదుపరుల నుంచి నిరంతర పెట్టుబడులు రావడం కూడా మార్కెట్కు మద్దతునిస్తున్నాయి. దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను () తగ్గింపుపై చర్చలు జరగడం విదేశీ పెట్టుబడిదారులలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ 50 దాదాపు 23,961 పాయింట్లకు, సెన్సెక్స్ 77,301 పాయింట్లకు చేరాయి. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో మార్కెట్ మరింతగా పుంజుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడిచమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు మార్కెట్ తదుపరి కదలికలను ప్రభావితం చేసే అంశాలుగా కొనసాగనున్నాయి. ఈ అంశాలపై మార్కెట్ నిశితంగా దృష్టి సారిస్తోంది.


