ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే విధులను పక్కనపెట్టి ఫామ్‌హౌస్‌లో పార్టీ చేసుకున్న ఘటన తెలంగాణలో కలకలం రేపుతోంది. జిల్లా బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చెందిన సిబ్బంది పుట్టినరోజు వేడుకల పేరుతో ఫామ్‌హౌస్‌లో డ్యాన్సులు చేస్తూ, స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు.
వివరాల ప్రకారం కతెర్ల గ్రామం సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఆదివారం పోలీస్ సిబ్బంది తమ సహోద్యోగి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కొందరు మహిళా పోలీసులు సహా పలువురు పాల్గొన్నట్లు వీడియోల్లో కనిపిస్తోంది. వర్షంలో డ్యాన్సులు చేయడం, స్విమ్మింగ్ పూల్‌లో సందడి చేయడం వంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి.
అయితే కొందరు సిబ్బంది పోలీస్ స్టేషన్లో విధులకు హాజరైనట్లు నమోదు చేసుకున్నప్పటికీ అనుమతి లేకుండా వేడుకలకు వెళ్లారనే ఆరోపణలు రావడంతో వ్యవహారం తీవ్రంగా మారింది. మద్యం సేవించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
14 మందిపై చర్యలు ఐదుగురి బదిలీ
వీడియోలు వైరల్ కావడంతో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం మొత్తం 14 మంది సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
ఐదుగురు పోలీసులను రామగుండం కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ బదిలీ చేశారు. మరో తొమ్మిది మందిపై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు. విధులకు గైర్హాజరయ్యారా ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్నారా అనే అంశాలను పరిశీలిస్తున్నారు.
పోలీస్ శాఖ క్రమశిక్షణ విధి నిర్వహణపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది. విచారణ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.






