మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 09
సమాజంలోని పేద, బలహీన, అణగారిన వర్గాలకు ఉచిత న్యాయ సేవలు అందించడంతో పాటు, ప్రతి ఒక్కరికీ న్యాయపరమైన హక్కులపై అవగాహన కల్పించడమే జాతీయ న్యాయ సేవల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని లయన్స్ క్లబ్ ప్రతినిధులు తెలిపారు.

జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో లయన్స్ క్లబ్ , లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాయి. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాదులు కర్రె లచ్చన్న, చుంచు సదానందం, వడ్నాల సత్యనారాయణ, గంగారెడ్డిలను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికలను అందజేశారు.
న్యాయ రంగంలో విశేష సేవలందిస్తున్న సీనియర్ న్యాయవాదులను గౌరవించడం అభినందనీయమని, న్యాయ సేవల ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, గోల్డెన్ జూబ్లీ క్లబ్ అధ్యక్షులు లయన్ డాక్టర్ నరేష్ కుమార్, సీనియర్ క్లబ్ సభ్యులు లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ వినయ్ కుమార్, లయన్ డాక్టర్ అభిషేక్, లయన్ సత్యపాల్ రెడ్డి, లయన్ కొత్త సురేందర్, లయన్ కారుకోరి చంద్రమౌళి, లయన్ చందూరి మహేందర్, లయన్ డాక్టర్ శరత్ కుమార్, లయన్ జట్టి లతతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.