సంగారెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి పూజ అనంతరం లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు.
సంగారెడ్డి మెడికల్ కాలేజీ విద్యార్థులు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వినాయకుడి పూజ అనంతరం లడ్డూ ప్రసాదాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు అందజేశారు. వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థులకు వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, చదువులో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










