హైదరాబాద్, 2026-06-05
హైదాబాద్ోఆదివాంజిినమాథాన్న్ోబీజేీాష్ట్ఉాధ్యక్షఘనాథావ,క్ెడిచా్ట్భవనని్మాణమాజీఅధ్యక్షదినేష్కమా్తోాటవా్ొన్నా.ఈోవాఉత్సాహంాా్ొనిఅందినీఆకట్టకన్నా.
హైదరాబాద్లో ఆదివారం జరిగిన మారథాన్ రన్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు ఉత్సాహంగా తన బృందంతో కలిసి పరుగులు తీసి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ రన్ ఫిట్నెస్, సమైక్యతను పెంపొందించడంతో పాటు నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని పలువురు పేర్కొన్నారు. మంచిర్యాల నుంచి మరికొందరు కూడా ఈ పరుగులో పాల్గొన్నారు.
హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు)ను విజయవంతంగా పూర్తి చేసినట్లు దినేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విజయం నాకు గర్వంగా, సంతోషంగా ఉంది. తదుపరి లక్ష్యాల కోసం ఇది నన్ను మరింత ప్రేరేపిస్తుంది అని అన్నారు. క్రెడి చాప్టర్ భవన నిర్మాణ మాజీ అధ్యక్షులు దినేష్ కుమార్ కూడా ఈ రన్నింగ్లో పాల్గొన్నారు.












