మండల కేంద్రంలో జాతిపిత మహాత్మా జయంతి వేడుకలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మహాత్మా చూపిన అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన ఆశయాలను నేటి తరాలు ఆచరించాలని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం గాంధీజీ చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.












