మహాత్మా గాంధీ చూపిన అహింస, శాంతి మార్గాల ద్వారానే బ్రిటిష్ వారిని దేశం నుండి తరిమికొట్టామని మంచిర్యాల నగర మేయర్ మధుకర్ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన మహాత్ముడికి నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు.
జగత్తులో అహింసను మించిన అస్త్రం లేదని, శాంతిని, అహింసను ప్రధాన అస్త్రాలుగా స్వాతంత్ర పోరాటంలో దేశ పౌరుల హక్కులను సాధిస్తూ, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని దేశం నుండి పారద్రోలిన మహనీయుడు మహాత్మా గాంధీ అని మంచిర్యాల నగర మేయర్ మధుకర్ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా స్టేషన్ రోడ్ లోని గాంధీ పార్క్ లో విగ్రహానికి పూలమాలవేసి మీడియాతో మాట్లాడారు. సత్యమేవ జయతే అన్న సూక్తిని అక్షరాలా పాటించి చూపిన జాతిపిత గాంధీ అని అన్నారు. మంచిర్యాల కార్పొరేషన్ అభివృద్ధిలో చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ, ఎమ్మెల్యే దంపతులు సురేఖ, ప్రేమ్‌సాగర్ రావు ఆశీర్వాదంతో అభివృద్ధికి బాటలు వేస్తామని మేయర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, సిటీ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.












