గజ్వేల్, 2026-08-15
గజ్వేల్ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పావన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్తమ ఉద్యోగులను సన్మానించారు.
గజ్వేల్ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ పావన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపోలో ఉత్తమ కండక్టర్లుగా ఎంపికైన వల్లాల శ్రీనివాస్, ఫర్వీనా సుల్తానా, ఉత్తమ డ్రైవర్లు ఎల్లయ్య, శంకరయ్యలను ఘనంగా సన్మానించి అవార్డులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిపో సీఐ బాబు నాయక్ తో పాటు ఉద్యోగులు శ్యామ్ సుందర్ గౌడ్, శంకర్, గోవింద్, నారాయణ, పరమేష్, ఆడెపు శ్రీనివాస్, జయందర్ రెడ్డి, జైపాల్, వీఎస్.రెడ్డి, అంబాదాస్, వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












