ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల సేవలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బీజేపీ నిర్వహిస్తున్న సేవా జ్యోతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని భాజపా జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈనెల 7న మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం జరగనుంది.
మంచిర్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 25 సంవత్సరాల పాటు నిరంతరాయంగా దేశానికి సేవలు అందించిన సందర్భంగా ఈ సేవా జ్యోతి కార్యక్రమాన్ని పార్టీ నిర్వహిస్తోందని తెలిపారు. సేవాజ్యోతి కార్యక్రమం అనంతరం వికసిత్ భారత్ సంకల్ప సభను నిర్వహించనున్నారని, ఈ సభలో ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రసంగిస్తారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాజపా కార్యకర్తలు, లబ్ధిదారులు, బీజేపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సన్నాహక సమావేశంలో మంచిర్యాల కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎనగందుల కృష్ణమూర్తి, వెంకటేశ్వరరావు, కార్యక్రమ కన్వీనర్, జిల్లా ఉపాధ్యక్షులు పట్టి కృష్ణ, జోగుల శ్రీదేవి, అక్కల రమేష్, కమలాకర్ రావు, జిల్లా కార్యదర్శులు వైద్య శ్రీధర్, రాచర్ల సంతోష్, స్టేట్ కౌన్సిల్ సభ్యులు సుదీర్ గౌడ్, బీసీ మోర్చా అధ్యక్షులు ఆకుల అశోక్ వర్ధన్, ఎస్టీ మోర్చా అధ్యక్షులు ప్రేమ్ సింగ్ రాథోడ్, కర్మల జోన్ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజు, సీనియర్ నాయకులు దేవర్నేని సంజీవరావు, సోషల్ మీడియా కన్వీనర్ జయరాం రావు, మండల, పట్టణ స్థాయి నాయకులు పాల్గొన్నారు.












