సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి యూనిట్లకు చెందిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవోస్) నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఎం.డీ.నవాజ్ అలీ అధ్యక్షుడిగా, ఎం.దుర్గయ్య ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి యూనిట్లకు చెందిన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ (టీఎన్జీవోస్) నూతన కార్యవర్గ ఎన్నికలు జిల్లా అధ్యక్షుడు ఎం.డీ.జావీద్ అలీ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ఎం.డీ.నవాజ్ అలీ అధ్యక్షుడిగా, ఎం.దుర్గయ్య ప్రధాన కార్యదర్శిగా, ఉప్పరి సురేష్ అసోసియేట్ అధ్యక్షుడిగా, జే.నాగలింగం కోశాధికారిగా, బి.సువర్ణ మహిళా ఉపాధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి వ్యవహరించి, ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన కార్యదర్శి వి.రవి, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కాశిని శ్రీకాంత్, జిల్లా కోశాధికారి శ్రీనివాస్, వివిధ రాష్ట్ర ఫోరమ్ అధ్యక్షులు భాస్కర్, బలరాం, నర్సిములు, జగన్ హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఎం.డీ.జావీద్ అలీ మాట్లాడుతూ, ఉద్యోగులు ముందుగా తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రజలకు సేవ చేయాలని సూచించారు. అదే సమయంలో ఉద్యోగుల హక్కుల కోసం సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. టీఎన్జీవోస్ యూనియన్ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని కోరారు.












