జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు నిర్వహించిన పత్రికా సమావేశంలో, ఎర్రబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ జిల్లాలో దిగజారుడు రాజకీయాలు చేస్తూ, బీసీలను అణిచివేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.
జిల్లా కేంద్రంలోని బీసీ భవన్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు పత్రికా విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి తిరుపతి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మడిపల్లి సత్యం మాట్లాడుతూ, ఎర్రబెల్లి రఘునాథ్, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ లు కలిసి జిల్లాలో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, దళితుల భుజంపై తుపాకీ పెట్టి బీసీలను అణిచివేసే కార్యక్రమానికి తెర లేపారని ఆరోపించారు. మొన్న రఘునాథ్ మోటార్ సైకిల్ వర్క్ షాప్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో, కొందరు రఘునాథ్ అనుచరులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్తలు అనే ఇంగిత జ్ఞానం లేకుండా వ్యక్తిగతంగా దూషిస్తూ, బెదిరింపులకు పాల్పడి, కుటుంబాలపై ఆరోపణలు చేస్తూ, ఇళ్లపై దాడులు చేస్తామని చెప్పి మాట్లాడే విధానానికి పూర్తిగా రఘునాథ్, వెంకటేశ్వర గౌడ్లే నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రఘునాథ్ సంస్కారం ఏ పాటిదో, అతని అనుచరులు మాట్లాడిన తీరే అతని ఆలోచనలకు అద్దం పడుతుందని అన్నారు. ఇంత కుసంస్కారంతో ఉన్న రఘునాథ్ ను ప్రశ్నిస్తే, సస్పెండ్ చేస్తామని, లేకపోతే మా పార్టీ వాడు కాదని, లేకపోతే బాధ్యతలు లేని వారని, బీసీలందరినీ అణిచివేసే కోణంలో రఘునాథ్ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని, దీనిపై రాష్ట్ర పార్టీ విచారణ జరపాలని కోరారు. పార్టీ నిధులను గోల్మాల్ చేయడమే కాకుండా, పత్రికల్లో వచ్చిన ఆరోపణలపై ప్రశ్నిస్తే నన్ను ప్రశ్నిస్తావా, మమ్మల్ని ప్రశ్నిస్తావా మీ అంతు చూస్తామని మాటలు చూస్తే రఘునాథ్, బీజేపీని సొంత జాగీరులాగా వ్యవహరిస్తున్నారని, తన పెంపుడు గ్రామ సింహాలను బీసీ నాయకులపైకి ఎగవేస్తున్నారని అన్నారు. జిల్లాకు ఇన్చార్జిగా ఉన్న ఓదెలు గారు ఈ విషయాలపై సమగ్రమైన విచారణ జరిపించాలని, మేము చేస్తున్న ఆరోపణలను కచ్చితంగా నిరూపిస్తామని తెలియజేస్తూ, రఘునాథ్, వెంకటేశ్వర గౌడ్ ల నుంచి భారతీయ జనతా పార్టీని జిల్లాలో నడిపించాలని పార్టీ ఇంచార్జి గారిని కోరారు. అపార సిద్ధాంతపరమైన అనుభవం ఉన్న ఇన్చార్జి ఓదెలు గారు, పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణతో పని చేసే కార్యకర్తలతో జిల్లాలో పార్టీని విజయవంతంగా ముందుకు తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు వారికి ఉన్నాయని, ఆ దిశగా వారు తప్పు చేసిన వారిని క్షమించకుండా కఠిన నిర్ణయాలు తీసుకోవాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నాం. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి తిరుపతి, మడిపల్లి సత్యనారాయణ, బానోతు దాస్య, గందె శ్రీనివాస్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. (మడిపల్లి సత్యనారాయణ, బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు).












