సింగరేణిని బీఆర్ఎస్ పార్టీ విధ్వంసం చేసిందని, అధికారం కోసం కేటీఆర్ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రజల తిరస్కరణ దానికి నిదర్శనమని, సింగరేణి నిధులను సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేటలో వినియోగించారని, కార్మికుల మద్దతును గులాబీ పార్టీ కోల్పోయిందని పేర్కొన్నారు.

గర్జన సభ గులాబీ పార్టీ ఉనికి కోసమేనని, జిల్లా అభివృద్ధిని ఎమ్మెల్యేలతో కలిసి సమిష్టిగా ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు. మంచిర్యాలలో వర్గ పోరుకు ఆస్కారం లేదని, వచ్చే ఎన్నికల్లో ప్రజాపాలన ప్రభుత్వం ప్రజా మద్దతుతో గెలుస్తుందని అన్నారు.
అందరినీ కలుపుకొని ముందుకు సాగాల్సిందేనని, విభేదిస్తే రాష్ట్ర పీసీసీ చూసుకుంటుందని, ఉద్యోగ, ఉపాధి కల్పన దిశగా చెన్నూర్ అసెంబ్లీ, మందమర్రి, కేతన్ పల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. దీనితో యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.
టామ్ కామ్ ద్వారా విదేశాల్లో, ముఖ్యంగా జర్మనీ, జపాన్ దేశాల్లో ఉద్యోగాలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.