నిర్మల్ రూరల్, 11 November
ఆదిలాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఆదివాసీల సంప్రదాయ నృత్యమైన గుస్సాడిని ఎమ్మెల్యే స్వయంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాల ప్రాముఖ్యతను కొనియాడారు.
ఆదిలాబాద్ మండలంలోని అంకోలి, అంకాపూర్, కె వి కాలనీ చిన్నమాలే, బోరిగాం, పెద్ద మాలే బోరిగాం గ్రామాల్లో నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన గుస్సాడి నృత్యం చేశారు. ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న ఆదివాసీ సంప్రదాయం, సంస్కృతి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఆత్మగౌరవానికి నిలుస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.


