పాలకులు (అక్షరవేకువ) నవంబర్ 11
ఆదిలాబాద్లో ఐటీ టవర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఈ ప్రాంతంలో ఐటీ హాబ్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఐటీ టవర్ ఏర్పాటుతో స్థానికులకు, ముఖ్యంగా గ్రామీణ నిరుద్యోగులకు మేలు జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదిలాబాద్లో ఐటీ టవర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇక్కడ ఐటీ హాబ్ను ఏర్పాటు చేస్తామని, ఐటీ టవర్ ఏర్పాటుతో ఆదిలాబాద్ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉపయోగపడుతుందని అన్నారు. సీసీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ చొరవ చూపాలని, సీసీఐ ఏర్పాటుకు, ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నివిధాలా సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. చదువుకున్న యువత వలసలు వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. గత జిల్లాను నిర్లక్ష్యం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్, ఐటీ సెక్రటరీ అనుదిప్ దూర్షెట్టి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మున్సిపల్ ఛైర్పర్సన్ బండారి అనూష, డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.







