బిక్కనిగూడ, దండేపల్లి (అక్షరవేకువ) నవంబర్ 14
మండలంలోని గూడెం సెక్టార్ పరిధి బిక్కనిగూడ అంగన్వాడీ కేంద్రంలో ఆరు నెలలు నిండిన కవల చిన్నారులకు ఘనంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, గ్రామ సర్పంచ్ చిలుకూరి మహేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సురేష్, అంగన్వాడీ సిబ్బంది, స్థానిక ప్రముఖులు, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. చిన్నారులకు ఆశీస్సులు అందిస్తూ తొలిసారిగా అన్నం తినిపించి, అన్నప్రాసన వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యకరమైన ఎదుగుదలలో పౌష్టికాహారం ప్రాముఖ్యతను తల్లులకు వివరించారు. ఆరు నెలల వయస్సు పూర్తయిన తర్వాత తల్లిపాలతో పాటు అదనపు పోషకాహారం అందించడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఎదుగుతారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, ఆయా, గ్రామ పెద్దలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని, వేడుకను విజయవంతం చేశారు.


