మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 14
హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో జరిగిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ సమావేశంలో జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్, రెడ్‌క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శివ ప్రతాప్ శుక్ల ను వారు ఘనంగా సత్కరించారు.
ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా చైర్మన్ల సమావేశం శనివారం లోక్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి రెడ్‌క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ శివ ప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా రెడ్‌క్రాస్ తరఫున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. మధుసూదన్ రెడ్డి, జిల్లా చైర్మన్ కె. భాస్కర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను శాలువాతో ఘనంగా సత్కరించి, జిల్లాలో రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి వివరించారు.
లోక్‌భవన్‌లో రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. జిల్లాలో చేపడుతున్న సేవా కార్యక్రమాలను మధుసూదన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ రాష్ట్ర చైర్మన్, ఐఏఎస్ అధికారి దానకిషోర్, రాష్ట్ర కార్యదర్శి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.







