మంచిర్యాల, మంచిర్యాల (అక్షరవేకువ) నవంబర్ 15
జిల్లా కేంద్రంలో మంత్రి, ఎంపీల పేర్లను అడ్డుపెట్టుకుని ఒక నాయకుడు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఒక ఏజెన్సీని ముందుపెట్టి ఫ్లెక్సీల ఏర్పాటు, దుస్తుల కొనుగోలు పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారని సమాచారం.
జిల్లా కేంద్రంలో మంత్రి, ఎంపీల పేర్లను ఉపయోగించుకుని ఒక నాయకుడు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఒక ఏజెన్సీని ముందుపెట్టి మంచిర్యాలలో 10, చెన్నూరులో 10 ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామంటూ సుమారు రూ.1.40 లక్షలు వసూలు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం అందింది.
అంతేకాకుండా, మంత్రి పిఏ తోపాటు గన్మెన్లకు దసరా కానుకగా దుస్తులు గిఫ్ట్ కోసం విక్రయాల కోసం వసూళ్లకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మంచిర్యాలలో ఏజెన్సీ నిర్వహిస్తున్న ఒక మహిళను సంప్రదించి ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తోంది. వరంగల్‌లో ఉన్న ఆమె భాగస్వామి విచారణతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం అందింది.
మంత్రి, ఎంపీల పేర్లను అడ్డుపెట్టుకుని సాగుతున్న ఈ వ్యవహారంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సదరు నాయకుడి తీరుతో ప్రజాప్రతినిధుల ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఏజెన్సీ నిర్వాహకులు నేరుగా మంత్రిని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.
ప్రస్తుతం ఈ వసూళ్ల వ్యవహారం మంచిర్యాల రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.







