సంగారెడ్డి, 15 November
విద్యా రంగంలో 25 ఏళ్ల విశిష్ట సేవలకు గాను సంగారెడ్డి మండలానికి చెందిన గణిత ఉపాధ్యాయుడు కడియాల చంద్రశేఖర్‌కు ప్రతిష్ఠాత్మక డా. ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ పురస్కారం2026 లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకున్నారు.
విద్యా రంగంలో 25 ఏళ్లుగా విశిష్ట సేవలందిస్తున్న సంగారెడ్డి మండలానికి చెందిన గణిత ఉపాధ్యాయుడు కడియాల చంద్రశేఖర్ కు ప్రతిష్ఠాత్మక డా.ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ పురస్కారం2026 లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆదివారం శ్రీ ప్రగతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సంస్థ చైర్మన్ శ్రీనివాస్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు.
గత 25 సంవత్సరాలుగా విద్యారంగంలో అంకితభావంతో పని చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తూ, గణిత విద్యాభివృద్ధికి చేస్తున్న విశేష కృషిని గుర్తించిన ఫౌండేషన్ ఆయనను ఈ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. ఉపాధ్యాయ వృత్తిని సేవాభావంతో కొనసాగిస్తూ విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్న చంద్రశేఖర్‌కు ఈ అవార్డు దక్కడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
ఈ మండల విద్యాధికారి విద్యాసాగర్, ప్రధానోపాధ్యాయుడు వాహేద్ పాషా తో పాటు పలువురు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు చంద్రశేఖర్‌ను అభినందించారు. ఈ జాతీయ పురస్కారంతో ఆయన ఇప్పటివరకు మొత్తం 16 అవార్డులను అందుకోవడం విశేషం.







