ఆదిలాబాద్, 17 November
ఉట్నూర్ లోని ఆదివాసీ నేచురల్స్ స్టోర్ లో చెక్క గానుగ నూనె తీసే యంత్రం అందుబాటులో ఉంది. ప్రజలు కెమికల్, కల్తీ వంట నూనెలు వాడకుండా, గానుగ వంట నూనెలను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని స్టోర్ నిర్వాహకుడు మెస్రం హన్మంతు సూచించారు.
ఉట్నూర్ లోని ఆదివాసీ నేచురల్స్ స్టోర్ లో చెక్క గానుగ నూనె తీసే యంత్రం అందుబాటులో ఉందని, ప్రజలు కెమికల్, కల్తీ వంట నూనెలు వాడకుండా గానుగ వంట నూనెలను వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు. తమ వద్ద పల్లి, నువ్వులు, కొబ్బరి, ఇప్ప నూనె, కుసుమ, పొద్దుతిరుగుడు నూనె తదితర నూనెలను ప్రజలకు అందుబాటులో ఉంచామని, సద్వినియోగం చేసుకోవాలని స్టోర్ నిర్వాహకుడు మెస్రం హన్మంతు తెలిపారు.







