సంగారెడ్డి, 17 November
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన రోగటి దేవిక అనే విద్యార్థినికి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేయడానికి ల్యాప్‌టాప్ అందించాలని విశ్రాంత మండల విద్యాధికారి, న్యాయవాది, రోటేరియన్ డి.అంజయ్య సంగారెడ్డి కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. సంగారెడ్డి జిల్లా మండలం, గ్రామానికి చెందిన దేవిక ప్రస్తుతం బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది.
చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన రోగటి దేవిక అనే విద్యార్థినికి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేయడానికి ల్యాప్ టాప్ అందించాలని విశ్రాంత మండల విద్యాధికారి, న్యాయవాది, రోటేరియన్ డి.అంజయ్య సంగారెడ్డి కలెక్టరేట్ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన రోగటి దేవిక, తన తల్లిదండ్రులు సులోచన, హన్మంతులు చిన్నతనంలోనే మరణించడంతో అనాథగా మారింది. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ సంగారెడ్డిలోని బాలసదన్‌లో ఆశ్రయం పొందుతూ పదవ తరగతి వరకు విద్యను అభ్యసించింది. అనంతరం పాలిటెక్నిక్ పూర్తి చేసి, ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్లో ఉన్న అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల అండదండలు లేకపోయినా పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న దేవికకు ఇంజనీరింగ్ విద్యను విజయవంతంగా పూర్తి చేయడానికి ల్యాప్‌టాప్ ఎంతో అవసరమని డి.అంజయ్య అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దేవిక వంటి నిరుపేద, అనాథ విద్యార్థినులను ప్రోత్సహించడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రభుత్వ సీ.ఎస్.ఆర్. నిధుల ద్వారా గానీ, స్వచ్ఛంద సంస్థలు, దాతలు లేదా ఇతర సహాయ మార్గాల ద్వారా గానీ దేవికకు ఒక ల్యాప్‌టాప్ సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఒక ల్యాప్‌టాప్ అందించడం ద్వారా దేవిక ఉన్నత విద్యకు తోడ్పడటమే కాకుండా, ఆమె భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవచ్చని డి.అంజయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.







