సంగారెడ్డి, 18 November
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోలీస్ కృష్ణ ఆయనను ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ నివాసంలో పోలీస్ కృష్ణ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పోలీస్ కృష్ణ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు వెంకట్ యాదవ్ తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.




