రామగుండం, ఆదిలాబాద్, నిర్మల్, తెలంగాణ (అక్షరవేకువ) నవంబర్ 18
గణశయతచశ.ళూచగ,శ,గహచూగచశణొఉహగశణశగ
తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ దూకుడు పెంచుతోంది. రామగుండం, ఆదిలాబాద్, నిర్మల్ వేదికగా నిర్వహించిన మూడు గర్జన సభలకు భారీ స్పందన లభించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణే బీఆర్ఎస్ రాజకీయ పునరాగమనానికి సంకేతమని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బుధవారం పేర్కొన్నారు.
సింగరేణి గర్జనతో కార్మికుల సమస్యలను, రైతు గర్జనతో రైతుల కష్టాలను ప్రధాన అజెండాగా ముందుకు తీసుకొచ్చిన కేటీఆర్, ప్రభుత్వ హామీల అమలుపై కాంగ్రెస్ను నిలదీశారు. గత బీఆర్ఎస్ పాలనలో అమలైన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీటి పథకాలను ప్రజలకు గుర్తుచేస్తూ ముందుకు వెళ్తున్నారు.
మరోవైపు కేసీఆర్ రాజకీయ అనుభవం, కేటీఆర్ దూకుడు, యువతతో అనుసంధానం పార్టీకి కొత్త బలాన్నిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోనే భారీ సభలు నిర్వహించి తమ బలాన్ని చాటుకోవడం బీఆర్ఎస్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.
మూడు గర్జన సభలకు లభించిన స్పందనతో పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ప్రజా సమస్యలపై పోరాటం, ప్రభుత్వ హామీలపై నిలదీతతో బీఆర్ఎస్ తిరిగి అధికారమే లక్ష్యంగా రాజకీయ సమరానికి సిద్ధమవుతున్నదనే సంకేతాలు కనిపిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గులాబి ప్రభావం పెద్ద ఎత్తున ఉండబోతుందని ధీమా వ్యక్తం చేశారు.







