హైదరాబాద్, 10 November
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన డా. మద్దెల సంతోష్ నియామకం అయ్యారు. ఈ నియామకం పట్ల ముదిరాజ్ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీలో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన డా. మద్దెల సంతోష్‌కు అధికార ప్రతినిధిగా కీలక బాధ్యతలు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా పనిచేసిన ఆయనను, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు.
ఈ సందర్భంగా, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న డా. మద్దెల సంతోష్‌కు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా డా. మద్దెల సంతోష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతానని అన్నారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో సేకరించి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతానని డా. మద్దెల సంతోష్ స్పష్టం చేశారు.




